Babu Jagjivan Ram: వైసీపీ కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు 3 d ago

AP: వైసీపీ కేంద్ర కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలుమాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం జగ్జీవన్ రామ్ పోరాటం చేశారని, ఆయన ఈ దేశంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు.ఆయన జీవితం అంతా పేదల కోసమే పోరాడారని, ఈ తరం నాయకులందరూ ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. సమాజంలో వెనుకబడిన వారి అభివృద్ధి కోసం పోరాటం చేశారని, అదే విధంగా వైఎస్ జగన్ కూడా ఆయన అడుగుజాడల్లో ముందుకెళుతూ ఆశయ సాధనకు కృషి చేశారన్నారు.
బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం పని చేసిన ప్రభుత్వం వైసీపీ అని బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ ఆశయాలు అమలు చేస్తున్న వ్యక్త జగన్ ఒక్కరే అని పేర్కొన్నారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదని, కూటమి ప్రభుత్వంలో అణగారిన వర్గాలపై అక్రమ కేసులు పెట్టి, వేధిస్తున్నారన్నారు. బాబు జగ్జీవన్ రామ్ అనేక శాఖలకు మంత్రిగా పని చేశారని, అదే విధంగా దళితులకు అంత పెద్ద స్థాయిలో పదవులు ఇచ్చిన నాయకుడు జగన్ అని తెలిపారు. ఒకప్పుడు దళితులకు ప్రాధాన్యత లేని పదవులు ఇచ్చావారని, కానీ ప్రతి దళితుడికి వైఎస్ జగన్ ప్రాధాన్యత కలిగిన మంత్రిత్వ శాఖలు కట్టబెట్టారన్నారు. చరిత్ర ఉన్నంత కాలం ఆయన్ను ఈ సమాజం గుర్తు పెట్టుకుంటుందన్నారు.